ATP: తాడిపత్రి పట్టణంలో సాయి కిరణ్ అనే వ్యక్తి శనివారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా నివసిస్తున్న ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.