కామారెడ్డి జిల్లా కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ హాజరయ్యారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో జిల్లాలోని అన్ని స్థానాలలో పోటీ చేసి గెలిచేందుకు పార్టీ సన్నద్ధమవుతోందని ఆయన తెలిపారు. జనాభా ప్రకారం సీట్లు కేటాయించామన్నారు.