ELR: ఉంగుటూరు మండలంలోని గోపాలపురంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు గడ్డిమేట్లకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు చెందిన 21 ఎకరాల గడ్డిమేట్లతో పాటు, ఐదు ఎకరాలకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి ఒక పాడి గేదె తీవ్రంగా గాయపడటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.