PDPL: ముత్తారం మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీ మేరకు పోతారం – హరిపురం రోడ్డు నిర్మాణం, చెరువును మినీ ట్యాంక్ బండిగా మార్చేందుకు రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేయడంతో కృతజ్ఞతగా బాణసంచా పేల్చారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మంత్రి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు.