KMM: ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా గ్రామంలో శనివారం గోవింద స్వాముల ఇరుముడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోతు పాపా ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సర్పంచ్ పేర్కొన్నారు.