ADB: నార్నూర్ మండలంలోని బేతల్ గూడ గ్రామపంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. గ్రామసభలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహణకు ఇబ్బందిగా ఉందని సర్పంచ్ జాదవ్ పరమేశ్వర్ అన్నారు. ఈ మేరకు నూతన గ్రామపంచాయతీ కార్యాలయం భవనాన్ని మంజూరు చేసి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.