KMR: జిల్లా భిక్కనూర్ మండలం మోటాన్ పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రరాజు(32) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.