ATP: జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతిని ఉపేక్షించేది లేదని ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. జనసంచార ప్రదేశాల్లో ఆయుధాలు కలిగి ఉండటం, గాలిలో కాల్పులు జరపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అక్రమ తుపాకుల విక్రయాల వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, ఇటువంటి ముఠాలపై నిరంతర నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.