PLD: అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై రొంపిచర్ల మండలం విప్పర్ల వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన హుస్సేన్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హుస్సేన్ విప్పర్ల గ్రామం వద్ద గల ఓ పెట్రోల్ బంకులో టైల్స్ పని చేసేందుకు రాగా ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు.