AP: ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రాంగ్ రూట్లో బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతులు ద్వారకతిరుమలకు చెందిన రఫీ, చరణ్, బన్నీగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.