SKLM: జిల్లాలో గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్ లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.