బాక్సింగ్ డే టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటయ్యింది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో హెడ్(46) మినహా ఎవరూ రాణించలేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులే చేసిన ఇంగ్లండ్.. విజయం కోసం 175 చేయాలి. టెస్టుల్లో స్వల్ప టార్గెట్ అనిపించినా 150 రన్స్ కూడా కష్టమే అనేలా పిచ్ ఉంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన స్టోక్స్ సేన పుంజుకుంటుందేమో చూడాలి.