BDK: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లలో చైనా మాంజాల విక్రయాలపై పోలీసులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కొత్తగూడెంలో ఈ మాంజాల వల్ల పలువురు వాహనదారులు, పక్షులు తీవ్ర గాయాలపాలైన ఘటనలను చాలా ఉన్నాయి.