అన్నమయ్య: రైల్వేకోడూరు మండల పరిధిలోని దేవరకొండలో శ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.