TG: హైదరాబాద్ కాచిగూడలో నిన్న జరిగిన AC పేలుడులో ఓ బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న అతని కవల సోదరుడు కూడా రాత్రి మరణించాడు. రెండేళ్ల ఈ కవలలను రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు.. షార్ట్ సర్వ్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చిన్నారుల మృతిలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.