GNTR: గత ఐదేళ్లుగా పొన్నూరులోని గోతాలస్వామి ఆశ్రమంలో చికిత్స పొంది, మానసిక స్థితి మెరుగుపడిన నలుగురు మహిళలు శుక్రవారం ముంబైకి బయలుదేరారు. ‘మానవత’, ‘శ్రద్ధా ఫౌండేషన్’ సంస్థల సహకారంతో కోలుకున్న వీరిని అర్బన్ సీఐ వీరా నాయక్, ఆశ్రమ నిర్వాహకులు గోతాలస్వామి, నన్నపనేని బాలకృష్ణ, డాక్టర్ శ్రావణిని అభినందించారు. అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపించారు.