BPT: ఇంకొల్లులో దారి తప్పిన నాలుగేళ్ల అంగన్వాడీ బాలికను పోలీసులు గంట వ్యవధిలోనే రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై సురేష్ నేతృత్వంలోని బృందం తక్షణమే స్పందించి, గాలింపు చేపట్టి పాపను సురక్షితంగా చేరవేసింది.