ASR: అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు తాజాగా మరింత పెరిగాయి. అరబికా పార్చిమెంటు కేజీ ధర రూ. 510 నుంచి రూ. 520కి పెరగగా, చెర్రీ కేజీ ధర రూ. 260 నుంచి రూ. 300 వరకూ పెరిగినట్లు కేంద్ర కాఫీ బోర్డు విస్తరణ విభాగం సీనియర్ లైజన్ అధికారి రమేష్ తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు.