TG: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చేనెల 1న కృష్ణా, గోదావరి జిల్లాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్ వేదికగా నిర్వహించే ఈ PPTలో రాష్ట్ర జలవిధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారు.