ADB: నిషేధిత చైనా మాంజా విక్రయించిన జైలు తప్పదని వన్ టౌన్ CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. పట్టణంలో చైనా మాంజాపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వన్ టౌన్ పరిధిలో ముగ్గురిపై మూడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.