SDPT: నూతన బస్టాండ్ స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టవద్దంటూ సీపీఐ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల క్రితం బస్టాండ్ నిర్మాణానికి తిరుమల యాదగిరిరావు, కల్వకోట సురేందర్ రావు 2ఎకరాలు భూమిని దానం చేశారన్నారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారని, ఈ నిర్మాణాన్ని నిలిపివేసి బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.