E.G: ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈవో కంది వాసుదేవరావు తల్లిదండ్రులకు శనివారం సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు.