KMM: యాసంగి వరి సాగు వేళ రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. తల్లాడ మండలం గంగదేవిపాడు పీఏసీఎస్ కేంద్రంలో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో భారులు తీరారు. రబీ సీజన్ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఎరువుల కొరత వేధిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని, ప్రభుత్వం స్పందించి సాగుకు సరఫరా చేయాలని కోరుతున్నారు.