కరీంనగర్ – జమ్మికుంట ప్రధాన రహదారిలోని చల్లూర్ గ్రామ పరిధిలో ఇసుక లారీల పార్కింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రహదారికి ఇరువైపుల వందల సంఖ్యలో లారీలు నిలిపి ఉంచడంతో ఇతర వాహనాలు ఎదురుగా వచ్చినపుడు నడపడం కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు. లారీలతో ప్రమాదాల ముప్పు పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు.