MDK: రామాయంపేట 44వ జాతీయ రహదారి పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కామారెడ్డి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా మారడంతో 108 సిబ్బంది సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.