KMM: కొణిజర్ల మండలం జంపాలనగర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవి మంటల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మంటల వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు జరిగే నష్టంపై అధికారులు విద్యార్థులు, గ్రామస్తులకు వివరించారు. ముఖ్యంగా ఎండాకాలంలో మంటలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.