ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H)లో ప్రతి ఏటా నిర్వహించే లంబాడి, బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జాతర జనవరి 6 నుంచి 15వ తేదీ వరకు జరగనుందని దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ తెలిపారు. జనవరి 11న ఉదయం 11 గంటలకు మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు, భక్తులు భారీసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.