TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, GHMCతో కలిపి 9 కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపాలిటీల గడువు ఈ ఏడాది జనవరిలో ముగియగా.. కార్పొరేషన్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో అన్నీ కలిపి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. జనవరిలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయనుంది.