VZM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి ఆలయంలో సహస్ర దీపారాధన కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలోని ఊయలలో సీతారాముల విగ్రహాలను అర్చకులు ప్రతిష్ఠించారు. వెయ్యి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు జరిపించారు. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.