E.G: ప్రముఖ వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో ఘనంగా సత్కారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రామారెడ్డి నిరంతర విద్యార్థిగా యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.