HYDలో NIMS ఆసుపత్రిలో రోగుల రద్దీకి అనుగుణంగా మెరుగైన వైద్య సేవల కోసం పలు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 90 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ యూరాలజీ, ఆంకాలజీ విభాగాల్లో రోబో సహాయంతో ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.