SKLM: ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 3 న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా నైపుణ్యాధికారి యు సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఇంటర్ ఐటిఐ డిగ్రీ పీజీ అర్హత కలిగి, 18–33 ఏళ్ల వయసు గల యువత యువకులు అర్హులని పేర్కొన్నారు. 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.