GDWL: జిల్లాలో పోలీస్ శాఖ వార్షిక నేర నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జిల్లాలో 41 అత్యాచారాలు, 14 హత్యలు, 4 చోరీ కేసులు నమోదయ్యాయి. 204 రోడ్డు ప్రమాదాల్లో 135 మంది మృతి చెందగా, 189 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్లో 7,056 కేసులు నమోదు చేసి రూ.33.96 లక్షల జరిమానా వసూలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద 64 కేసుల్లో 424 మందిని అరెస్ట్ చేశారు.