VSP: ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లను (08581/08582) ప్రకటించింది. విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం, బెంగళూరు నుంచి ప్రతి సోమవారం ఈ రైళ్లు జనవరి 4 నుంచి 26 వరకు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ రద్దీ వేళ ప్రయాణికులకు ఇవి ఉపశమనం కలిగించనున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.