KMM: నగరంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా అల్లిక అంజయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న దేవస్థానం బోర్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, తనతో పాటు ఎన్నికైన పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.