EG: నల్లజర్ల మండలం అనంతపల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీలపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్రంగా మండిపడ్డారు. పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామంటూ ఫ్లెక్సీల్లో ప్రదర్శించడం వైసీపీ రాక్షసత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇలాంటి అరాచక శక్తులను, వారి హింసాత్మక భావజాలాన్ని ప్రజలు గమనించాలని కోరారు