»Diamond Necklace A Precious Diamond Necklace Found In A Garbage Heap By A Sanitation Worker
Diamond necklace: పారిశుద్ధ్య కార్మికులకు చెత్త కుప్పలో దొరికిన విలువైన డైమండ్ నెక్లెస్
జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త కుప్పలో విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
Diamond necklace: A precious diamond necklace found in a garbage heap by a sanitation worker
Diamond necklace: జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త కుప్పలో విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. అయితే చెత్తను బయటకు వేసే క్రమంలో తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న అతను వెంటనే చెన్నై కార్పొరేషన్‌ను సంప్రదించారు.
వెంటనే అధికారులు కొందరు పారిశుద్ధ్య కార్మికులను డంపింగ్ యార్డుకు పంపించారు. అన్ని చెత్త డబ్బాలను వెతికించారు. చెత్తకుప్పలో డైమండ్ నెక్లెస్ దొరికింది. దీనిని కార్పొరేషన్ అధికారులు యజమానికి ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యపై వెంటనే స్పందించి విలువైన నెక్లెస్‌ను వెతికి ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.