Viral News: తీర్థంలో నిద్రమాత్రలు ఇచ్చి.. టీవీ యాంకర్‌పై అత్యాచారం చేసిన పూజారి
నిత్యం దైవారాధనలో ఉండే పూజారి ఓ టీవీ యాంకర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీర్థంలో మత్తిచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అని దేవుడి మీద ఒట్టుపెట్టి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Viral News: ఓ పూజారి దారుణానికి ఒడిగట్టాడు. ఓ టీవీ యాంకర్‌ను నమ్మించి మత్తు ఇచ్చిన తీర్థం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో కార్తీక్ మునిస్వామి పూజారిగా సేవలందిస్తున్నారు. చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో బాధిత యాంకర్ (30 ఏళ్లు) నివాసం ఉంటున్నారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, తరచుగా ఆలయాలకు వెళ్తుంది. ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడింది. దీంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడు.
ఒక రోజు బెంజ్ కారులో తనను డ్రాప్ చేస్తానని చెప్పి దారి మధ్యలో తీర్థంలో మత్తు ఇచ్చాడు. దాంతో యాంకర్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. తరువాత తనను గుడిలో పెళ్లి చేసుకుంటా అని నమ్మించి పలుమార్లు తనతో శరీరకంగా దగ్గరయ్యాడని, అలా తనకు ప్రెగ్నెన్సీ వస్తే.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని తెలిపింది. ఆ తరువాత నిలదీయడంతో తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో కార్తిక్ మునిస్వామిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి రికవరీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.