అనకాపల్లి: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్ గోవిందరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన యువతీ యువకులు ఆల్ లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్న్ షిప్ ద్వారా ప్రాక్టికల్ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామన్నారు.