Donald Trump : తన విజయం పక్కా అంటున్న డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన నామినేషన్‌ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం రండి.
Donald Trump in the race for the Nobel Peace Prize
Donald Trump Accepts Republican Party’s Nomination : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న డొనాల్డ్ ట్రంప్(DONALD TRUMP) నామినేషన్‌ను లాంఛనంగా ఆమోదించారు. దీంతో ఆయన అధికారికంగా ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మారారు. గురువారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌లో ఆయన ఇలా అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో ముందు ఉన్నది స్వర్ణ యుగమే అన్నారు. మరో నాలుగు నెలల్లో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదన్నారు.
తనపై హత్యా యత్నం జరిగిన సమయంలో ప్రజలంతా చూపిన మద్దతు, ప్రేమ మరువలేనివని అన్నారు. ఈ విషయంలో ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తన సంకల్పం చాలా గట్టిదని చెప్పారు. తాను ప్రజల ఓటును, మద్దతును, భాగస్వామ్యాన్ని వినమ్రంగా అర్థిస్తున్నట్లు వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని తాను కచ్చితంగా నిలబెట్టుకుంటానని తెలిపారు. ఎవ్వరినీ నిరాశపరచనని ట్రంప్(TRUMP) తెలిపారు.
ఓ వైపు ట్రంప్ దూకుడు పెరుగుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమాక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ తప్పుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. బైడెన్ ముసలితనం వల్ల ఆయన విజయావకాశాలు తగ్గిపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.