PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామ ఆలయ కమిటీ ఎన్నిక శుక్రవారం స్థానిక సర్పంచ్ రేండ్ల శారద అధ్యక్షతన ఏకగ్రీవంగా జరిగింది. పాలకమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్గా రేండ్ల కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఒడితల శ్రీనివాస్, బర్ల సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా రేండ్ల వెంకటనారాయణ, కోశాధికారిగా కొట్టే వేణు ఎన్నికయ్యారు.