»Kamala Harris Secures The Support Of Enough Democratic Delegates To Become Partys Presidential Nominee Survey
US Elections : కమలాహారిస్ పోటీ దాదాపుగా ఖాయమే అంటున్న అక్కడి సర్వేలు
కమలాహారిస్‌కు మెజారీటీ డెమాక్రాట్ల మద్దతు ఉందని, ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమేనని అక్కడి మీడియాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Kamala Harris President Nominee : మరి కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు అమెరికాలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేషన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమాక్రటిక్ పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా నిలవనున్నారు? అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలాహారిస్(KAMALA HARRIS) అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయినా సొంత పార్టీలో ఆమెకు పోటీ గట్టిగానే ఉంది. దీంతో ఆమె నామినేషన్ ఖరారు అవుతుందా?లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
స్థానిక మీడియా మాత్రం ఈ విషయంలో కాస్త స్పష్టతను ఇస్తోంది. డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమల హారిస్(KAMALA HARRIS) నామినేట్ కావడం దాదాపుగా ఖాయమని చెబుతోంది. డెమాక్రాటిక్ పార్టీకి 4800 మంది ప్రతినిధులుగా ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థి పదవి దక్కాలంటే వారిలో 1,976 మంది కచ్చితంగా మద్దతు ఇవ్వాలి. అయితే హారిస్ కు ఇప్పటికే 2,579 మంది మద్దతు ఉందని అక్కడి మీడియా సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే బైడెన్‌తో పాటు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ తదితరులు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. హారిస్‌కు మద్దతుగా నిలవాలని తన ప్రచార బృందానికి బైడెన్ పిలుపునిచ్చారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను కమల కోసం ప్రచారాల్లో పాల్గొంటానని చెప్పారు. ట్రంప్ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.