»Fear Of Snakes And Serpent Guards Of Jagannaths Ratna Bhandar Vsl
puri : పూరీ రత్న భాండాగారంలో కింగ్ కోబ్రాలు? భయపడుతున్న అధికారులు
దాదాపుగా 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గదిలో విష సర్పాల్లాంటివి ఉంటాయేమోనని అధికారులు భయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
JAGANNATH’S RATNA BHANDAR : పూరీ రత్న భాండాగారం.. ఈ రహస్య గదిపై ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉన్నారు. దాదాపుగా 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గది తలుపుల్ని అధికారులు ఆదివారం తెరవనున్నారు. నాలుగు దశాబ్దాలుగా మూసి ఉన్న ఆ గదిలో విష సర్పాలు(SNAKES ), మరింకేమైనా ప్రమాదకరమైన జీవులు ఉంటాయేమో అని వారు భయ పడుతున్నారు. పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న ఈ గదిని తెరిచే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిపుణులైన ఇద్దరు పాములు పట్టుకునే వారిని, వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ జగన్నాథ స్వామి రత్న భాండాగారంలోని ఖజానాకు బర్మీస్ కొండ చిలువ(SERPENT GUARD) కాపలాగా ఉంటుందని చెబుతారు. ఒడిశాలో స్థానికంగా ఉన్న ప్రజలు ఈ విషయమై కథలు కథలుగా చెప్పుకొంటారు. జగన్నాథ స్వామి, ఇతర దేవతలకు సంబంధించిన ఆభరణాలకు పాములు కాపలాగా ఉన్నట్లు పురాణాల్లో సైతం ఉందని అంటుంటారు. అయితే పురాణపరంగా చూసినా, సాధారణంగా చూసినా ఇక్కడ పాములు(SNAKES) ఉండే ఆస్కారం ఉందని అధికారులు మాత్రం జంకుతున్నారు.
ఇది చాలా పురాతనమైన ఆలయం కావడంతో ఆ గదికి ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు అక్కడికి చేరిపోయే అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆలయంలోని సేవకుడైన హరే కృష్ణ మహా పాత్ర కూడా సమర్థించారు. జగన్నాథ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేసే సమయంలో కూడా అక్కడ పాములు(SNAKES ) కనిపించాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు మరింత బలపడ్డాయి. దీంతో వైద్యుల్ని అక్కడ నియమించారు. పొరపాటున ఎవరికైనా విష సర్పాల్లాంటివి కరిస్తే తక్షణం వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మరి పూరీ రత్న భాండాగారంలో ఆభరణాలు, వజ్రవైఢ్యూర్యాలను చూసేందుకు ఆదివారం వరకు ఆగాల్సిందే.