Jagannath Puri Ratna Bhandar: Another secret room of Jagannath's Ratna Bhandar to open tomorrow!
Jagannath Puri Ratna Bhandar: ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. ఉదయం 9:51 నుంచి 12:15 వరకు శుభముహర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న సంపదను బయటకు తీసి తాత్కాలికంగా స్ట్రాంగ్రూంకు తరలించారు. దీనిని వీడియోగ్రఫీ కూడా చేయించారు. రేపు మరో రహస్య గదిని తెరిచి అందులోని సంపను మరో తాత్కాలిక స్ట్రాంగ్రూంకు తరలించి ఆ తర్వాత ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల కోసం అప్పగించనున్నారు.
పనులు పూర్తయ్యాక సంపదను మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామని తెలిపారు. రహస్య గదిని తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి రేపు ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయమండలి తెలిపింది. రత్న భాండాగారం కింద రహస్య గది ఉన్నదని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్పారు. ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని తెలిపారు.