Dogs Attack : ఏడాదిన్నర బాలుడిని ఈడ్చుకెళ్లి, దాడి చేసి చంపిన వీధి కుక్కలు
హైదరాబాద్లో ఓ చిన్నారిపై కుక్కులు దాడి చేసి చంపేశాయి. ఇలాంటి ఘటన ఒకటి అక్కడి జవహర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Dogs Attack : ఓ చిన్నారుని వీధి కుక్కలు దారుణంగా దాడి చేసి చంపేశాయి. ఏడాదిన్నర వయసున్న ఓ బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వీధి కుక్కలు(Street Dogs) అతడిపై ఎగబడ్డాయి. దాడికి పాల్పడ్డాయి. బాలుడిని(Boy) కొంత దూరం నోటితో ఈడ్చుకుని వెళ్లాయి. అక్కడ మరింత దాడి(Attack) చేయడంతో అతడి మెదడులోని కొంత భాగం బయటకు వచ్చేసింది. తీవ్ర గాయాలైన ఆ పసి బాలుడు చివరికి మృత్యువాత పడ్డాడు.
ఈ ఘటన హైదరాబాద్లోని జవహర్నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన లక్ష్మి, భరత్ దంపతులు జవహ్ నగర్లోని ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వారికి విహాన్ అనే ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో బాలుడు ఇంటి ముందు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కుక్కలు(Dogs) అతడిపై దాడికి దిగాయి. కొంత దూరం బాలుడిని ఈడ్చుకుని వెళ్లాయి. దారుణంగా గాయపరిచాయి.
కుక్కల గుంపును అక్కడుంటున్న స్థానికుడు పరిశీలించి చూడగా వాటి మధ్య తీవ్ర గాయాలతో పడివున్న విహాన్ కనిపించాడు. ఒళ్లంతా కుక్క కాట్లతో రక్తంలో తడిసి ముద్దయి ఉన్నాడు. అతడి మెదడులోని కొంత భాగం కూడా బయటకు కనిపిస్తూ ఉంది. దీంతో వెంటనే ఆ కుక్కల్ని స్థానిక వ్యక్తి తరిమి కొట్టాడు. బాలుడి తల్లిదండ్రులకు వెళ్లి చెప్పాడు. వారు వెంటనే విహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మంగళవారం రాత్రి 9 :30 గంటల సమయంలో అతడు మృతి(Boy Died) చెందాడు. స్థానికులు సైతం కుక్కల బెడద ఎక్కువగా ఉందని చాలా సార్లు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.