Nana Patekar slaps boy for taking selfie with him during film shoot
Nana Patekar slaps boy: విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. మీటూ ఉద్యమంలో అతని పేరు ప్రముఖంగా వినపడింది. ఇప్పుడు ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో నానా పటేకర్ (Nana Patekar) బ్రౌన్ బ్లేజర్, టోపి పెట్టుకొని ఉన్నాడు. వారణాసిలో గల దశస్వమేధ్ ఘాట్ వద్ద షూటింగ్ జరుగుతోంది. ఇంతలో ఓ అబ్బాయి నానా పటేకర్ వద్దకు వచ్చాడు. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ కోసం ట్రై చేయగా నానా పటేకర్ అటు తిరిగి ఉన్నాడు. ఇటు చూసే సరికి అబ్బాయి ఉన్నాడు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. ఫోటో దిగేందుకు అనుమతి ఇస్తారు.
#WATCH | वाराणसी में फिल्म जर्नी की शूटिंग कर रहे नाना पाटेकर का फैन को थप्पड़ मारते हुए वीडियो वायरल हो गया। फैन नाना पाटेकर संग सेल्फी लेने पहुंचा तो अभिनेता ने गुस्से में उसके सिर पर थप्पड़ मारा। फिल्म की यूनिट के सदस्य ने लड़के की गर्दन पकड़कर भगाया। pic.twitter.com/oU2WrY2Bv1
నానా పటేకర్ మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ యువకుడి తల వెనకాల కొట్టాడు. ఆ వెంటనే సిబ్బంది అతనిని మెడ పట్టుకొని బయటకు పంపించేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు నానా పటేకర్ ప్రవర్తనను తప్పు పడుతున్నారు. ‘మేం సాధారణ పౌరులం.. నటులను చూడటం అంటే దైవ సమానంగా భావిస్తాం. నటులతోపాటు క్రికెటర్లను కూడా ఆరాధిస్తాం. అలాంటి వారు తమను కొట్టిన ఓకే.. లేదంటే తన్నిన ఓకే సెటైర్లు వేస్తూ రాశాడు.
26/11 మూవీ చివరలో నానా పటేకర్ భారీ డైలాగులు కొడతాడు. తాను దేశభక్తుడిని అని చెప్పుకుంటారు. కానీ నిజ జీవితంలో కాదు. మన రియల్ హీరోలు సరిహద్దుల్లో ఉన్నారు. సినిమా తెరపై ఉన్న వారు హీరోలు కాదని రాశారు. స్టార్ డమ్ అనే మత్తులో నానా పటేకర్కు పిచ్చి పట్టిందని మరొకరు ఘాటుగా రాశారు. అందుకే అతనిపై చేయి చేసుకున్నాడని మండిపడ్డారు. గతంలో డబ్బుల కోసం పాటలు పాడటం, డ్యాన్స్ చేసేవారిని దుష్టులు అనేవారని గుర్తుచేశారు. ఇలా నానా పటేకర్ ప్రవర్తనను నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.