tractor : నైరుతీ రుతుపవనాలు దేశంలో ప్రవేశించినప్పటికీ చాలా చోట్ల పొడి వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో(uttarpradesh) ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎండ నుంచి ఉపశమనం కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అక్కడ కొందరు యువకులు ట్రాక్టర్ ట్రక్కునే స్విమ్మింగ్ పూల్(swimming pool) మార్చేశారు. ట్రక్కు నుంచి నీరు బయటకు లీక్ కాకుండా ఉండేందుకు మందపాటి పాలిథిన్ షీట్‌ని ట్రాక్టర్‌కి కట్టేశారు. ఆ పై నీరు నింపి దాన్ని స్విమ్మింగ్ పూల్ చేసేశారు.
ఆ ట్రక్కు స్విమ్మింగ్ పూల్‌లో యువకులు, పిల్లలు ఈతకొడుతూ, ఆడుకుంటూ సందడి చేశారు. ట్రాక్టర్‌ను రోడ్డు మీద తిప్పుతూ, నీటిలో ఆడుతూ కేరింతలు కొట్టారు. నృత్యాలు చేస్తూ మజా చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. వైరల్‌గా మారింది. ఇటీవల ఓ యూట్యూబర్ సైతం ఇలాగే తన కారును మినీ స్విమ్మింగ్ పూల్‌గా మార్చేశాడు. ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు అదే విధంగా ట్రాక్టరు ట్రాలీలో నీళ్లు నింపి వీరంతా ఎండ తాపాన్ని తగ్గించుకుంటున్నారు. రోడ్డుపై ట్రాక్టరు పై వెళుతూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరూ ఓ లుక్కేయండి.
#Breking#Amroha भीषण गर्मी से बचने के लिए तरह-तरह के अपना रहे तरीके,
ट्रैक्टर ट्राली को बनाया स्विमिंग पूल,
हाइवे पर ट्रैक्टर ट्रॉली मे बच्चों का नहाते वीडियो वायरल,