ఓ అబ్బాయి ఇంట్లో ఉండగా చిరుత పులి ప్రవేశించింది. అబ్బాయి తెలివిగా ఇంటి డోర్ పెట్టి తప్పించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో పట్ల నెటిజన్లు అబ్బాయి తెలివికి మెచ్చకుంటున్నారు.
Leopard: ఓ అబ్బాయి ఇంట్లో ఉండగా చిరుతపులి వచ్చింది. అది ఇంట్లోకి వెల్లడం గమనించి అబ్బాయి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇంటి డోర్ వేసి అందరికి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మహారాష్ట్రాలోని నాసిక్ జిల్లాలోని మలెగావ్ పట్టణంలో మోహిత్ విజయ్ అనే 12 ఏళ్ల పెల్లాడు ఇంట్లో కూర్చొని మొబైల్ గేమ్ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో చిరుత బయట నుంచి ఇంట్లోకి వచ్చింది. అది గమనించిన పిల్లాడు భయపడి అరవకుండా మెళ్లిగా బయటకు వెళ్లి డోర్ వేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలుడి ధైర్యానికి అందరూ ప్రశంసించారు.