»A Shock To Ibm Employees The Company Is Seeking Voluntary Resignation
IBM: ఐబీఎం ఉద్యోగులకు షాక్.. స్వచ్చంద రాజీనామా కోరుతున్న కంపెనీ
ఈ మధ్య కాలంలో పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీఎం కంపెనీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను కుదించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా ఎంప్లైస్ను స్వచ్చందంగా రాజీనామా చేయాలని కోరింది.
A shock to IBM employees.. The company is seeking voluntary resignation
IBM: ఈ మధ్య కాలంలో పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల సంఖ్యను కుదించాలని ఆలోచిస్తున్న కంపెనీలో ఇప్పుడు ఐబీఎం కూడా చేరింది. తమ సంస్థ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరుతోంది. కంపెనీలో పనిచేయాలను కోరుకోనివారు స్వచ్చందంగా తప్పుకోవచ్చని ఐబీఎం చెబుతోంది. ఐబీఎంలో పనిచేయాలని బలంగా కోరుకున్నారిని తొలగించాలని అనుకోవడం లేదని ఓ వార్త కధనం పేర్కొంది.
ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని భావించే ఉద్యోగులు ముందుకు రావాలని ఐబీఎం కోరుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో కంపెనీ చేపట్టే చర్యల్లో ఇది ఓ భాగమని అంటున్నారు. ఈ చర్యను ఐబీఎం రిసోర్స్ యాక్షన్‌గా అభివర్ణిస్తోంది. గత నెలలో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా స్వచ్ఛంద రాజీనామాల ప్రతిపాదనపై కంపెనీ తమ ఉద్దేశాన్ని వెల్లడించింది. కంపెనీలో ఆసక్తిగా పనిచేసే వారిని తొలగించడం కంటే ఇష్టం లేని వారినే స్వచ్చందంగా రాజీనామా చేయడం మంచిది అని తెలిపింది. ఈ లేఆఫ్‌లో ఎంత మందిని తీసేయనున్నారు అనేది బహిర్గతం చేయలేదు.