»Ibm Layoffs Ibm Announces Layoffs With Meeting Minutes
IBM Layoffs: నిమిషాల మీటింగ్‌తో లేఆఫ్‌లు ప్రకటించిన ఐబీఎం
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో సంస్థలు వేలాది మందిని తొలగించాయి. ఇప్పుడు కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ లేఆఫ్‌లు మొదలుపెట్టాయి.
IBM Layoffs: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో సంస్థలు వేలాది మందిని తొలగించాయి. ఇప్పుడు కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ లేఆఫ్‌లు మొదలుపెట్టాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో కొంతమందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లేఆఫ్‌లు ప్రకటించింది. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.
ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తున్నాని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై ఐబీఎం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఐబీఎం సహా పలు ప్రముఖ కంపెనీల్లో ఈ ఏడాది కూడా లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. 2024లో ఇప్పటివరకు 200లకు పైగా సంస్థలు దాదాపు 50వేల ఉద్యోగాల కోతలు ప్రకటించినట్లు Layoffs.fyi వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.